107 runs | కెమెరాలకు చిక్కిన ఆటిట్యూడ్ స్టార్

107 runs | కెమెరాలకు చిక్కిన ఆటిట్యూడ్ స్టార్
107 runs | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : క్రికెటర్ రియాన్ పరాగ్ మొదటి నుంచి తన ఆట కంటే ఆటిట్యూడ్‌ను ఎక్కువ ప్రదర్శిస్తుంటాడు. అందుకే అతనికి ఆటిట్యూడ్ స్టార్‌గా పేరొందాడు. మైదానంలో అతిగా ప్రవర్తిస్తూ అభిమానులకు, తోటి ఆటగాళ్లకు విసుగు తెప్పిస్తుంటాడు. గత సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇతను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆటగానికి ఇతను జట్టు కోసం చేసిందేమీ లేదు. ఫోజులు కొట్టడ తప్ప ఇప్పటి వరకు ఒక్క మంచి ప్రదర్శన కూడా చేయలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రియాన్ పరాగ్ 107 పరుగులే చేశాడు.
అయితే ఆటగాడిగానే కాదు అతని ప్రవర్తన కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 29 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఔటై డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన వెంటనే వేపింగ్ చేస్తూ కనిపించాడు. వేపింగ్ అంటే.. ఈ సిగరెట్ తాగడం. డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేయడంపై ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేవు. కానీ భారత్‌లో ఈ సిగరెట్ల ఉత్పత్తుల వాడకంపై నిషేధం ఉంది. ఈ క్రమంలోనే అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
