Sunday | యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ

Sunday | యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ
Sunday | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వారాంతాల్లో, సెలవు దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకించి శని, ఆదివారాల్లో భక్తులు పోటెత్తుతారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లు నిండిపోతాయి. ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు భారీగా తరలివచ్చారు. ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. మరోవైపు ఆలయంలో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు స్వామి వారి జయంత్యుత్సవాలు జరుగనున్నాయి. ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజతో ఆలయ అర్చకులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
