నూతన కడెం మండల తహసిల్దార్ గా ఖాజా మొయినుద్దీన్

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మండల డిప్యూటీ తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించి ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలానికి నూతన తహసీల్దార్‌గా ఖాజా మొయినుద్దీన్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

శనివారం ఖాజా మొయినుద్దీన్ కడెం మండల తహసీల్దార్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కడెం తహసీల్దార్‌గా పనిచేసిన రొడ్డ ప్రభాకర్‌కు ఆర్డీవోగా పదోన్నతి లభించగా, ప్రస్తుతం ఆయన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న ఎం. లచ్చిరాం‌కు ఎఫ్‌ఏసీ తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించగా, ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు.

ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్‌కు డిప్యూటీ తహసీల్దార్ లచ్చిరాం, సీనియర్ అసిస్టెంట్ ఎస్. గంగన్న, కడెం ఎంఆర్ఐ శారద, కార్యాలయ సిబ్బంది, మండలంలోని జీపీఓలు మరియు ఇతర సిబ్బంది శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply