వడదెబ్బకు వృద్ధురాలు మృతి

దమ్మపేట, ఆంధ్రప్రభ : వడదెబ్బకు వృద్ధురాలు మృతి చెందిన సంఘటన దమ్మపేట మండల పరిధిలోని వడ్లగూడెంలో ఆదివారం జరిగింది .మృతురాలి బంధువుల కథనం ప్రకారం వడ్లగూడెం గ్రామానికి చెందిన వల్లెపు వెంకటలక్ష్మి (60) శనివారం రాములవారి దర్శనానికి భద్రాచలం వెళ్లారు. తిరిగి వడ్లగూడెం చేరుకునేసరికి వెంకటలక్ష్మికి వాంతులు , విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది.ప్రథమ చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు సత్తుపల్లిలో ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకువెళ్ళే సరికి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు .
