Stimulate | వేడికి గురైన వెంటనే చల్లటి నీరు తాగితే శరీరానికి ఏం జరుగుతుంది?

Stimulate | వేడికి గురైన వెంటనే చల్లటి నీరు తాగితే శరీరానికి ఏం జరుగుతుంది?

Stimulate | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : బయట భానుడు భగభగలాడుతున్నాడు. సెగలు గక్కుతున్న గాలి, చెమటతో తడిసిన శరీరం.. ఇంటికి రాగానే మనకు గుర్తొచ్చే మొదటి పని ఫ్రిజ్ డోర్ తీయడం, చిల్లెడ్ వాటర్ బాటిల్‌ ను గట గటా ఖాళీ చేయడం. ఆ వెంటనే ఏసీ గాలి నేరుగా మొహానికి తగిలేలా నిలబడతాం. అప్పటికప్పుడు అది హాయినిస్తుందేమో కానీ, దీనివల్ల మన శరీరం లోపల జరిగే పరిణామాలు తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు.

మన శరీరం ఒక సున్నితమైన యంత్రంలా పనిచేస్తుంది.
దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం.

Stimulate |
Stimulate |

గుండెపై భారం :
ఎండలో తిరుగుతున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ స్థితిలో ఒక్కసారిగా ఐస్ లాంటి చల్లటి నీటిని తాగినప్పుడు శరీరంలో ‘వేగస్ నెర్వ్’ ఉత్తేజితం అవుతుంది. ఇది గుండె స్పందనను నియంత్రించే అతి ముఖ్యమైన నరం. ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోవడం వల్ల ఈ నరంపై ఒత్తిడి పడి, గుండె వేగం అసాధారణంగా తగ్గవచ్చు. దీనినే వైద్య భాషలో ‘కోల్డ్ షాక్’ అంటారు.

జీర్ణక్రియకు ఆటంకం :
చల్లటి నీరు తాగగానే మన రక్త నాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియకు అందాల్సిన రక్తం అందక, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, కడుపులో తిప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Stimulate |
Stimulate |

ఏసీ ముందు మొహం పెట్టడం :
ఎండలోంచి రాగానే ఏసీ ముందు నిలబడటం వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా పెను మార్పు సంభవిస్తుంది. దీన్ని మన మెదడు తట్టుకోలేదు. ముఖ్యంగా ముక్కు లోపల ఉండే మ్యూకస్ పొరలు ఎండిపోయి, వైరల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందుకే ఎండలోంచి వచ్చిన వారు వెంటనే ఏసీ గదిలోకి వెళ్లడం వల్ల జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

వెంటనే స్నానం వద్దు :
చెమట పట్టిన శరీరంతో వెంటనే స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే రంధ్రాలు ఒక్కసారిగా మూసుకుపోయి, శరీర వేడి లోపలే ఉండిపోతుంది. ఇది జ్వరం రావడానికి కారణం కావచ్చు. కనీసం 15-20 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాకే స్నానం చేయాలి.

Stimulate |
Stimulate |

ఫ్రిడ్జ్ వాటర్ కన్నా మట్టి కుండ నీరే మేలు :
ఫ్రిజ్ నీటి కంటే మట్టి కుండలో నీరు మన శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా చల్లబరుస్తుంది కాబట్టి ఎటువంటి హాని ఉండదు.

శరీరాన్ని సర్దుబాటు చేయనివ్వండి :
గదిలోకి రాగానే ఫ్యాన్ కింద కూర్చుని సాధారణ గాలికి చెమట ఆరిపోనివ్వాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చాక మాత్రమే నీళ్లు తాగడం లేదా ఏసీ ఆన్ చేయడం చేయాలి.

క్షణిక కాలం వచ్చే హాయి కోసం శరీర ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దు.. కాబట్టి, ఎండలోంచి రాగానే కాస్త ఆగి.. శరీరం కుదుటపడ్డాక మీ దాహాన్ని తీర్చుకోండి.

Stimulate |
Stimulate |
Stimulate |
Stimulate |
Stimulate |
Stimulate |

CLICK HERE TO READ MORE : 5 Fruits | ఎప్పుడు పడితే అప్పుడు తింటేనే చిక్కు!

CLICK HERE TO READ MORE :

Leave a Reply