యువకులకు ద్విచక్ర వాహనాలు కొనివ్వరాదు..

యువకులకు ద్విచక్ర వాహనాలు కొనివ్వరాదు..

గుండాల/ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా గుండాల మండల కస్తూర్బా పాఠశాల్లోని విద్యార్థినిలకు రోడ్డు భద్రత పట్ల ఎస్ఐ సైదా రాహుఫ్, ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు, విద్యాధికారి పార్వతి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కస్తూర్బా విద్యార్థినిలకు కళాబృందాలతో అవగాహనను నృత్యంతో కల్పించి 18 ఏళ్లు నిండని యువతీ యువకులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని సూచించారు.

అనంతరం ఎస్ఐ రాహుఫ్ ఎంపీడీవో బాలరాజు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధన పాటించాలని, వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని, వేగపరిమితిని పాటించాలని సూచించారు. బాధ్యతగా వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనం నడపడంతో కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులకు కష్టాలకు గురవుతారని గుర్తు చేశారు. భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కుటుంబ బాధ్యతలు గుర్తించుకోవాలని, ప్రమాదాల వల్ల పిల్లలు భార్య నడివీధిన పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ పై ఆధారపడిన ఎన్నో కుటుంబాల బంగారు భవిష్యత్తు గుర్తుంచుకోవాలన్నారు. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రత పాటిస్తామని కేజీబీవీ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మానవ హారం నిర్వహించి, ప్రజలు, అధికారులు ప్రతిజ్ఞను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply