సైనిక్ స్కూల్‌కు విద్యార్థిని ఎంపిక…

సైనిక్ స్కూల్‌కు విద్యార్థిని ఎంపిక…

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ పాఠశాల ఐదో తరగతి విద్యార్థిని కొత్త సంయుక్త విద్యా సంవత్సరానికి తిరుపతిలోని సైనిక్ స్కూల్‌కు ఎంపికైంది. సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర గ్రూప్స్ అధినేత ఎర్ర చంద్రశేఖర్ మాట్లాడుతూ… విద్యా సంవత్సరానికి ప్రకటించిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలల్లో తమ పాఠశాల విద్యార్థిని ఎంపిక కావడం చాలా సంతోషకరమన్నారు.

పాఠశాల స్థాపించినప్పటి నుంచి చాలా మంది విద్యార్థులు నవోదయ, గురుకుల, సైనిక్ స్కూళ్లకు ఎంపిక కావడం, ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో సీట్లు సాధించడం హర్షించదగ్గ విషయమని ఆయనతెలిపారు. ఆ విద్యార్థిని విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎర్ర సంపత్, అకాడమిక్ డీన్ హేమలత షిండే, పాఠశాల హెచ్.ఎం ఎదులాపురం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.

Leave a Reply