టీ.ఎన్.ఎస్. ఎఫ్ లోకి పలువురు చేరిక…

టీ.ఎన్.ఎస్. ఎఫ్ లోకి పలువురు చేరిక…
పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో కమ్యూనిస్ట్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం టి.ఎన్. ఎస్.ఎఫ్ లోకి పలువురు విద్యార్థులు చేరారు. వారిని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ కండువాలు మెడలో వేసి అహ్వానం పలికారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, టి. ఎన్. ఎస్. ఎఫ్. జిల్లా కార్యదర్శి పుల్లగూర చరణ్, సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు బంగారపు సతీష్, శివాలయం గుడి డైరెక్టర్ బండ సూర్య తదితరులు పాల్గొన్నారు.
