డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
కడెం, ఆంధ్రప్రభ: మండల కేంద్రమైన కడెంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ సంఘం నాయకులు పలు పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడెంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచశీల జెండాను నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దూరు కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.రాజన్న, కడెం ఎంపీ ఓటి శ్రీనివాస్ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఎండీ మునరుల్ హసన్ మాజీ సర్పంచ్ చిట్యాల చిన్నయ్య, యూత్ కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు టి. మల్లేష్ యాదవ్, మండల నాయకులు ఎండీ వాజిద్ ఖాన్, బొడ్డు గంగన్న డి.రాజశేఖర్, బబ్లు షేక్ రఫీక్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు పసుపుల వెంకన్న, బీ ఆర్ ఎస్ నాయకులు కోల గంగన్న, ముబారక్ జి.వేణుగోపాల్ నాయక్, జి.నాగరాజు, నరసయ్య బీజేపీ నాయకులు ఇస్లావత్ మోహన్ నాయక్, ఏ. రవీందర్ గౌడ్, పి. శ్రీరామ్, గట్ల నల్లగొండ నరసయ్య, దళిత సంఘాల నాయకులు అర్ల రమేష్, సీహెచ్ లక్ష్మణ్ కుమార్, డాక్టర్ ఆనంద్ జీపీ వార్డు సభ్యులు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
