దేవాలయానికి బహుమతి ఇచ్చిన భక్తులు..

దేవాలయానికి బహుమతి ఇచ్చిన భక్తులు..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ లోని శ్రీ ధనమైసమ్మ దేవాలయం మెట్ల బావి, ఆలయానికి రెండు వైర్లెస్ మైక్రో ఫోన్ సిస్టమ్ ను భక్తులు కాసం నమశివాయ పుల్లూరి శ్రీనివాస్ బహుకరించారు. శుక్రవారం ఉదయం వరంగల్ వాస్తవ్యులు రాజా ఎలక్ట్రానిక్స్ ప్రొప్రైటర్ కాసం నమశివాయ పుల్లూరి శ్రీనివాస్ అమ్మ వారి ఆశీస్సుల కోసం ఆలయానికి రెండు వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ ను ఆలయ అధ్యక్షులు తోట బాబాన్న ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా తోట బాబన్న మాట్లాడుతూ.. కాసం నమశివాయ పుల్లూరి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యుల పై అమ్మవారి చల్లని దీవెనలు ఉండి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది అన్నారు.
