husband killed wife |పోలీసుల ఎదుటే దారుణం..

husband killed wife |పోలీసుల ఎదుటే దారుణం..

ప్రియుడితో వెళ్లిపోయింద‌ని.. భార్య గొంతులో పొడిచిన భ‌ర్త‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వివాహేత‌ర సంబంధం ఓ మ‌హిళ ప్రాణం తీసింది. భ‌ర్త‌ను వ‌దిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న ఆ మ‌హిళ భ‌ర్త ఆమెను పోలీసుల ఎదుటే గొంతులో పొడిచి హత్య చేసిన ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌హీరాబాద్‌కు చెందిన సిద్దారెడ్డి భార్య కవిత తన ప్రియుడు పవన్‌తో మార్చి 27న ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆమె భర్త సిద్ధారెడ్డి మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, కవిత జడ్చర్లలో పవన్‌ తో ఉన్నట్లు గుర్తించారు. దీంతో కవితను తిరిగి జహీరాబాద్‌కు తీసుకురావడానికి పోలీసులు, భర్త సిద్ధారెడ్డి కలిసి జడ్చర్లకు వెళ్లారు. కవితను తీసుకువస్తున్న సమయంలో, సిద్ధారెడ్డి మార్గమధ్యంలో ఓ కత్తి కొనుగోలు చేశాడు. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకున్నప్పుడు, పోలీసులు ఉన్నప్పటికీ ఆవేశంతో కత్తితో కవిత గొంతులో పొడిచి అక్కడికక్కడే హత్య చేశాడు. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply