15 Places Smash : ఇజ్రాయెల్​ ఉక్కిరి బిక్కిరి Andhra Prabha News

15 Places Smash : ఇజ్రాయెల్​ ఉక్కిరి బిక్కిరి Andhra Prabha News

  • ఇరాన్ క్షిపణుల వర్షం
  • దేశవ్యాప్తంగా ఉద్రిక్తత
  • సెంట్రల్ ఇజ్రాయెల్ లక్ష్యం
  • క్లస్టర్ బాంబులతో దాడులు..
  • 15 ప్రాంతాలు ధ్వసం
  • పెటా తిక్వాలో మహిళ తీవ్ర గాయాలు
  • టెల్ అవీవ్‌లో భవనానికి నష్టం
  • గివత్ షెమ్యూల్, బ్నె బ్రాక్, రామట్ గాన్ ప్రాంతాల్లో శకలాల పాతం
  • అనధికార యుద్ధ వాతావరణం

( ఆంధ్రప్రభ, జెరుసలేం ప్రతినిధి)

15 Places Smash

ఒక వైపు మధ్యవర్తులు రాజీయత్నాల్లో బిజీబిజీగా ఉంటే.. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్​ ఆపరేషన్​ ఎథిక్​ ప్యూరీలో ఇరాన్​ విధ్వంసమే లక్ష్యగా .. దాడులు జరుపుతుంటే.. ఇక ఇరాన్​ ఎక్కడ తగ్గటం లేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఇరు పక్షాలు.. క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇజ్రాయెల్​ దాడిలో ఇప్పటికి ఇరాన్​ లో 25 మంది మృతి చెందగా… ఇరాన్​ తన క్షిపణుల దాడిలో 15 ఇజ్రాయెల్​ స్థావరాలను మాటష్​ చేసింది.

15 Places Smash : 15 ప్రాంతాలు మటాష్​

15 Places Smash

సెంట్రల్​ ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా ఏప్రిల్ 6, 2026) ఉదయం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సెంట్రల్ ఇజ్రాయెల్‌లో 15 ప్రాంతాలు దెబ్బతిన్నట్టు తాజా నివేదికల సమాచారం . ఈ దాడుల్లో ప్రధానంగా జనవాసాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

15 Places Smash : 10 క్షిపణులతో ఇరాన్​ దాడి

15 Places Smash

పెటా తిక్వా (Petah Tikva)లో క్షిపణి శకలాలతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది 1515ఆమె ఛాతీకి గాయమైంది. . ఆమెను చికిత్స నిమిత్తం బెయిలిన్సన్ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు.

15 Places Smash

ఇక్కడ అనేక కార్లు కాలిపోయాయి. భవనాలు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్ (Tel Aviv) నగరంలోని ఒక భవనం దెబ్బతింది. గాజు ముక్కలతో ఒకరు గాయపడినట్లు సమాచారం. గివత్ షెమ్యూల్ (Givat Shmuel), బ్నె బ్రాక్ (Bnei Brak), రామన్ గాన్ (Ramat Gan) పరిసరాల్లో కూడా శకలాలు పడినట్లు నివేదికలు అందుతున్నాయి. ఇరాన్ సుమారు 10 క్షిపణులను ప్రయోగించిందని, ఇవి క్లస్టర్ బాంబులను (Cluster munitions) కలిగి ఉన్నాయని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.

ALSO READ : Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News

Leave a Reply