బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని చీకటయపాలెం గ్రామానికి చెందిన చంటి వీరయ్య(65), దైద లక్ష్మి లు ఇటీవల మృతి చెందడంతో శనివారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జక్క ఇంద్రసేనారెడ్డిలు బాధిత కుటుంబాలను సందర్శించి పరామర్శించారు.

ఆ కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం, రూ. 6 వేల నగదును అందజేశారు.ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో పేదలకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు బాధిత కుటుంబాలకు సక్రమంగా అందే విధంగా కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు చెవిటి సధాకర్, చీకటియపాలెం, ఫతేపురం గ్రామ సర్పంచ్ లు చిదురాల కృష్ణమూర్తి, ఇట్టే మాధవరెడ్డి, నాయకులు గౌతమ్ రెడ్డి, వల్లపు రాఘవులు, రావుల వెంకటరెడ్డి,మడిపల్లి, చీకటాయపాలెం గ్రామాల అధ్యక్షులు వెన్నెం సోమిరెడ్డి దుండి వీరన్న, గ్రామ ఉపసర్పంచ్ పోడకంటి సరస్వతి శేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఏకాంబరం, వేల్పుకొండ స్వప్న ఉపేందర్, కటకం రమేష్, గజ్జి మనోహర్, ఓరుగంటి వెంకన్న, పల్లె యాకన్న, బూర్గుల దస్తగిరి, పులి రామచంద్రు, యాకయ్య, నరసింహ, వెంకటేశ్వర్లు, సంపత్, కృష్ణ యాదవ్, వెంకన్న, రవి, యర్రం రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply