ప్రపంచ శాంతి కోరుతూ శాంతి ర్యాలీ..

ప్రపంచ శాంతి కోరుతూ శాంతి ర్యాలీ..

గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ పాస్టర్స్ ఫెలోషిప్, ఆరాధన టీవీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోరుతూ గుడివాడ పట్టణంలో క్రైస్తవ విశ్వాసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు క్రైస్తవ సంఘాలకు చెందిన పాస్టర్లు పాల్గొని ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ప్రార్ధనలు చేసి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అనంతరం పట్టణంలోని దైవజనుల సహకారంతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు శ్యామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్ అప్పికట్ల జాషువా, బ్రదర్ అబ్రహం శేఖర్, వేసుపోగు విజయబాబు, పలు సంఘాల పాస్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply