Auto LPG | కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Auto LPG | కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
Auto LPG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఆటో ఎల్‌పీజీ కొరత సమస్య తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.
రాష్ట్రంలో ఆటో ఎల్‌పీజీ సరఫరా లోపం కారణంగా రవాణా వ్యవస్థపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఎల్‌పీజీ ఆధారిత ఆటోలు ఉన్నాయని, సరఫరా లేక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రత్యేకంగా హైదరాబాద్‌లో ఆటో ఎల్‌పీజీ కొరత కారణంగా ప్రజా రవాణా సేవలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కి విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా అదనపు ఎల్‌పీజీ సరఫరా చేయాలని కోరిన ఉత్తమ్, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.
