1 Indian Dead : కువైట్​లో భారతీయుడు…​ Andhra Prabha Latest News

1 Indian Dead : కువైట్​లో భారతీయుడు…​ Andhra Prabha Latest News

ప‌వ‌ర్ ప్లాంట్‌ ధ్వసం
ఇండియన్​ టెక్నిషియన్ గా గుర్తింపు
ఇరాన్​ క్షిపణి దాడి ఫలితం

ఆంధ్రప్రభ, దోహ ప్రతినిధి

1 Indian Dead : మధ్య ప్రాచ్యంలో అడుగు పెడితే.. అగ్గిపెట్టేస్తామని ఐఆర్​ జీసీ ప్రకటించిన కిన్ని గంటల్లోనే .. తన మిసైళ్లు, డోన్లతో కువైట్​ ను కకావికలం చేసింది. కువైట్‌లోని కీలక విద్యుత్ కేంద్రంపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు దుర్మరణం చెందాడు. కువైట్‌లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో కీలక సుబియా (Subiya) పవర్ ప్లాంట్‌ లక్ష్యంగా ఆదివారం రాత్రి ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో విద్యుత్ కేంద్రం ప్రధాన భవనం నియంత్రణ గది (Control Room) తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షిపణి నేరుగా భవనాన్ని ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది.

1 Indian Dead : భారతీయ కార్మికుడు మృతి

ఈ ప్లాంట్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఒక భారతీయ పౌరుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు కువైట్ విద్యుత్తు, నీటి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. అమెరికా తన యుద్ధనౌకలను (USS ట్రిపోలి వంటివి) రంగంలోకి దించి కువైట్ ఇతర గల్ఫ్ దేశాలలోని స్థావరాల నుంచి ఇరాన్‌పై దాడులకు ఉపయోగిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికాకకు సహకరిస్తున్న దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. అందులో భాగంగానే ఈ పవర్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

1 Indian Dead : చీకటిలో కువైట్

కువైట్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో కువైట్ అంతటా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన కువైట్ రక్షణ శాఖ తమ గగనతలంపైకి వచ్చిన 14 బాలిస్టిక్ మిస్సైళ్లు, 12 డ్రోన్లను కూల్చివేసింది.

Leave a Reply