కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక

కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక
అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలో చేరిక
లింగాపూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ చెందిన నలుగురు సర్పంచులు ఆశీర్వాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం బి ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బి ఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు కేటీఆర్ ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు.
బి ఆర్ఎస్ లో చేరిన వారిలోలింగాపూర్ సర్పంచ్ జాధవ్ రాజశేఖర్,ఎల్లపటార్ సర్పంచ్ పవార్ బాబులాల్ (బబ్లు) పిట్టగూడ సర్పంచ్ ఆడే హట్ట్యా నాయక్చిన్నదంపూర్ సర్పంచ్ పవార్ సులోచన సంతోష్ నైతం ఛత్రు లింగాపూర్ ఉపసర్పంచ్ చేరారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ మండల మాజీ జడ్పీటీసీ ఆడే రక్కబాయి లక్య నాయక్, జాటోత్ రాహుల్, జాధవ్ రమేష్, జాధవ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
