LPG | 70 శాతానికి పెంచిన కేంద్రం

LPG | 70 శాతానికి పెంచిన కేంద్రం

LPG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సరఫరా కోటాను పెంచుతూ రాష్ట్రాలకు ఉపశమనం కల్పించింది. వాణిజ్య గ్యాస్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచినట్లు ప్రకటించింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇటీవల కమర్షియల్ గ్యాస్ సరఫరా కోటాను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్రం దశలవారీగా సరఫరాను పెంచుతోంది. గతవారం సరఫరాను 50 శాతానికి పెంచిన కేంద్రం, తాజాగా మరో 20 శాతం పెంచి 70 శాతానికి తీసుకువచ్చింది. ఈ నిర్ణయంతో వాణిజ్య రంగానికి కొంత మేర ఊరట లభించనుంది.

Leave a Reply