Hari Hara Veeramallu | వేగం పెంచిన హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న పీరియాడిక‌ల్ మూవీ హ‌రిహ‌ర‌వీర‌ల్లు. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించిన‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో అభిమానుల్లో కాస్త జోష్ నెల‌కొంది.

అయితే, పవన్ కళ్యాణ్ అభిమానులు దాదాపు మూడు సంవత్సరాలుగా తమ అభిమాన హీరో నుండి కొత్త చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, హరి హర వీరమల్లు చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు.

కానీ రాజకీయ సమీక్షలు, ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా, ఆయ‌న‌ మొత్తం షూట్‌ను పూర్తి చేయలేకపోయాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత అతను 12 రోజులు మాత్రమే షూట్‌లో పాల్గొన్నాడు. వచ్చే వారం లో ఆయన డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.

సినిమా షూటింగ్స్ కోసమే ఆయన ఈమధ్య డైలీ వర్కౌట్స్ కూడా చేస్తున్నాడు. ఒకపక్క ఆయన సినిమా షూటింగ్ కి సిద్ధం అయ్యేందుకు వర్కౌట్స్ చేస్తుంటే, మరోపక్క మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వేగవంతం చేసింది.

Leave a Reply