అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం

అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం
మహిళలు,పేద ప్రజలను, నిరుద్యోగులను వంచించిన బడ్జెట్,
ఆరు గ్యారంటీలకు మంగళం పాడిన బడ్జెట్,
ప్రజలకు ఉపయోగపడే స్కీమ్‌లకు సరైన కేటాయింపులు లేవు,
అవినీతి అవకాశాలు ఉన్న ప్రాజెక్టులకు భారీ నిధులు,
ఈ బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్,
మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల
భీమ్‌గల్ రూరల్,ఆంధ్రప్రభ : ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీతో పేద ప్రజలను, మహిళలను, నిరుద్యోగులను పూర్తిగా వంచించిన బడ్జెట్‌గా ఉందని అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఈ ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందని ఇప్పటికే స్పష్టమైంది. అయినా కూడా మళ్ళీ అదే విధంగా అంకెల మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది అని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అయినా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పై, 420 హామీల అమలులో బడ్జెట్లో ఎలాంటి స్పష్టత లేదు అని విమర్శించారు. ప్రజలకు పనికొచ్చే స్కీం లకు కేటాయింపు లు లేవు కానీ స్కామ్ లు చేసే ప్రాజెక్ట్ లకు కేటాయింపు లు చేసారు.కోటి 58 లక్షల మహిళలకు ఇస్తానన్న ₹2500 చేయూత పథకం ప్రస్తావనే లేదు వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు పెన్షన్‌ను ₹2000 నుండి ₹4000కి పెంపు కేటాయింపులు లేవు తులం బంగారం హామీ – పూర్తిగా మర్చిపోయారు. జాబ్ క్యాలెండర్ పూర్తిగా విస్మరించబడింది.పూర్తి కాలేని రుణమాఫీపై స్పష్టత లేదు.“రైతు భరోసా” పేరుతో హామీలు ఇచ్చినా, ఇప్పటి వరకు మూడు పంటలకు ఎగ్గొట్టారు.
ఆచరణ కు సాధ్యం కానీ రాజీవ్ యువవికాసానికి మాత్రం బడ్జెట్ లో ప్రతి సారి కేటాయింపులు చేస్తూ వస్తున్నారు.కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో ఈ బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉంది.ఈ ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ.. ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదు.మొతంగా ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను పూర్తిగా వంచించే బడ్జెట్‌గా నిలిచింది. ఈ బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని అన్నారు.ఎన్నికల అప్పుడు ప్రజలకు అనేక హామీలతో ఆశలు కల్పించి బడ్జెట్ లో కేటాయింపులు చేయక పేద ప్రజలను నట్టేట ముంచారు అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
