National Highway | డ్రైవర్ ను కాపాడాల్సింది పోయి…

National Highway |డ్రైవర్ ను కాపాడాల్సింది పోయి…

National Highway | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏదైనా రోడ్డుపై ప్రమాదం జరిగితే.. ప్రమాదంలో చిక్కుకున్నోళ్లను వదిలేసి… మాకేంటి లాభం అని వాళ్ల లాభం కోసం చూస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోతున్నారు. ఆయిల్ ట్యాంకర్ లాంటివి ఏవైనా బోల్తాపడితే.. లారీ డ్రైవర్ ను ప్రమాదం నుండి రక్షించడం మరిచి.. ఆయిల్ ను ఎత్తుకెళ్లడం లాంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా బుజ‌బుజ్జ జాతీయ‌ ర‌హ‌దారిపై వెళ్తున్న లారీ బోల్తాపడింది. లారీలో ఉన్న కూల్ డ్రింక్స్ (Cool drinks) బాటిళ్లు మొత్తం రోడ్డుపై పడిపోవడంతో లారీ చుట్టూ జనం గుమిగూడారు.

అయితే లారీ డ్రైవర్ (Lorry driver) ను, క్లీనర్‌ను రక్షిస్తున్నారేమోనని అనుకున్నారు. కానీ అలా చేయలేదు. రోడ్డుపై పడిపోయిన కూల్ డ్రింక్స్ తీసుకెళ్లే పనిలో పడ్డారు. దొరికినన్ని కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఎత్తుకెళ్లారు. పది నిమిషాల్లో మొత్తం ఖాళీ చేసేశారు. డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి.. మాన‌వ‌త్వం మ‌రిచిపోయారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో కూల్ డ్రింక్స్ తీసుకెళ్లిన జనంపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Leave a Reply