యువకుడి అనుమానాస్పద మృతి

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం పోచారం గ్రామ శివారు ప్రాంతంలో అనుమానాస్పద మృతి చోటుచేసుకుంది. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బాబుల గంగాధర్ (19) అనే యువకుడు పోచారం శివారు ప్రాంతంలోని దూపల్లి రైల్వే గేటు వద్ద గల బోరు బావి పక్కన మృతదేహంగా కనిపించాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువకుడి మృతి పై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply