ఆడబిడ్డల ఆరోగ్యానికి భరోసా

ఆడబిడ్డల ఆరోగ్యానికి భరోసా
- గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్
- బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మహిళల్లో పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్ ముప్పును అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమం బెల్లంపల్లిలో ఆదివారం ప్రారంభమైంది. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు డీవైడీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ నాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. రవికుమార్ తో కలిసి ప్రారంభించారు.
మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేశామని చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం బాగుంటుందని, ఈ అవకాశాన్ని బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. రవికుమార్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేశామని చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం బాగుంటుందని, ఈ అవకాశాన్ని బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డివైడీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మహిళల మరణాలకు గర్భాశయ క్యాన్సర్ ప్రధాన కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిని ప్రాథమిక దశలోనే నివారించేందుకు హెచ్పీవీ టీకా ఒక అద్భుతమైన ఆయుధమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం ఈ టీకాను ఉచితంగా అందుబాటులోకి తెచ్చాయని, దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. రవికుమార్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకా వేయించడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ సోకే ప్రమాదాన్ని దాదాపు వంద శాతం నివారించవచ్చని తెలిపారు.
పాఠశాల వయసులోనే ఈ టీకా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ఆసుపత్రిలో సిబ్బంది అందరికీ దీనిపై అవగాహన కల్పించామని, ప్రతి ఒక్కరికీ టీకా అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు చింతల వసంత, జంగం కల్పన, ఢీకొండ పద్మ, శ్రావణ్ కుమార్, కంకటి ప్రణీత, గాలి సుమలత, పోలు ఉమాదేవి లీడర్లు బండి ప్రభాకర్, దావ రమేష్, ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
