పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు..

పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు..

మహిళా కానిస్టేబుల్స్‌కు శాలువలు, సత్కారాలు చేశారు.

నర్సంపేట క్రైమ్, ఆంధ్రప్రభ : నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడి, కేక్ కట్టి సంబరాలు జరిపారు. శాలువలతో సత్కరించడం ద్వారా వారి ధైర్యాన్ని, కృషిని అభినందించారు.ఈ కార్యక్రమం ద్వారా మహిళా పోలీస్ సిబ్బంది మధ్య ఏకాభిప్రాయత, బృందంగా పని చేసే భావన పెరిగిందని పోలీస్ అధికారులు చెప్పారు. నర్సంపేట పోలీస్ కమిషనర్ పరిధిలో మహిళా దినోత్సవాలను నిర్వహించడం సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట సీఐ, ఎస్ఐలు,ఏఎస్ఐలు,కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Leave a Reply