Deer | మానవత్వం చాటిన గోపాల మిత్ర…

Deer | మానవత్వం చాటిన గోపాల మిత్ర…

గాయపడిన జింకకు ప్రాణాధారం

Deer | దేవరకద్ర, ఆంధ్రప్రభ : దారి తప్పి గ్రామంలోకి చేరి గాయాలతో అలమటిస్తున్న ఓ జింకను చూసి గోపాల మిత్ర రమేష్ గౌడ్ హృదయం కదిలింది. వెంటనే స్పందించి జింకను పేరూరు పశు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

సమయానికి అందిన వైద్యంతో జింక ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సంఘటన చూసిన గ్రామస్తులు రమేష్ గౌడ్ మానవత్వాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు. మూగజీవాల పట్ల ప్రేమ, కరుణ చూపిన ఆయన సేవ అందరికీ ఆదర్శంగా నిలిచింది.

Deer |

Leave a Reply