రాహుల్ గాంధీకి మెమెంటో బహుకరించిన ఎమ్మెల్యే

రాహుల్ గాంధీకి మెమెంటో బహుకరించిన ఎమ్మెల్యే

పార్టీ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి
ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ

ఉట్నూర్, ఆంధ్రప్రభ : వికారాబాద్ లో పది రోజులపాటు డిసిసి అధ్యక్షులకు జరిగిన సంఘటన్ సృజన్ అభియాన్ లో శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారని ఆయనకు కుటుంబ సభ్యులతో కలిసి మెమెంటో బహుకరించినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బో జ్జు పటేల్ తెలిపారు.

చివరి రోజు అధ్యక్షుల కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ ఆత్మీయ సమ్మేళనంలో

ఖానాపూర్ ఎమ్మెల్యే నిర్మల్ డిసిసి అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ జాతీయ నాయకులతో కలయిక క్షేత్రస్థాయి పర్యటనలు, అగ్రశ్రేణి నాయకత్వం సూచనలు మరువలేని అనుభూతినిచ్చాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాహుల్ గాంధీ అన్నారని పేర్కొన్నారు. ఈ పది రోజుల ముగింపు కార్యక్రమంలో శిక్షణ తరగతుల నిర్వాహకులు సచిన్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు షర్మిల, ఇన్చార్జీలు మీనాక్షి నటరాజన్, మాణిక్యం ఠాకూర్, వక్తలు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క కోదండరాం, కంచె ఐలయ్య, బంగ్యా భూక్యా, కొప్పుల రాజు, ప్రవీణ్ చక్రవర్తి ఎంపీ సెంథల్, తదితరులు పలు అంశాలపై ఈ శిక్షణా తరగతుల్లో బోధించినట్లు బొజ్జు పటేల్ తెలిపారు.

రాహుల్ గాంధీతో బొజ్జు పటేల్ గారి కుటుంబ సభ్యుల భేటి….కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని శిక్షణ తరగతుల చివరి రోజు నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబ సభ్యులు కలిశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ ఆప్యాయంగా పలకరించి కుటుంబ మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. ఇటు ఎమ్మెల్యేగా అటు డీసీసీ అధ్యక్షులుగా పార్టీ కోసం శ్రమిస్తున్న బొజ్జు పటేల్ ను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply