సర్కిల్ వన్ పీజీఆర్‌ఎస్‌లో ఒకే ఒక అర్జీ దాఖలు…

సర్కిల్ వన్ పీజీఆర్‌ఎస్‌లో ఒకే ఒక అర్జీ దాఖలు…

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ వన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10.30 గం లకు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 48వ డివిజన్ గున్నబత్తుల అచ్చయ్యమ్మ వీధికి పొట్నూరి కృష్ణ ప్రసాద్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ నిమిత్తం అర్జీ దాఖలు చేశారు.

ఆ అర్జీని జోనల్ కమిషనర్ రమ్య కీర్తన టౌన్ ప్లానింగ్ విభాగానికి పంపేరు. ఈకార్యక్రమంలో ఈఈజె శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ రెవెన్యూ యువీబీ శర్మ, ఏ.ఎం.అండ్ హెచ్ ఓ డాక్టర్ అన్నపూర్ణ, ఇంజనీరింగ్ ఏ ఈ పూర్ణచంద్రరావు, డీసీపీ వై. చంద్రబోస్, శానిటరీ సూపర్వైజర్ డి సోమరాజు, మలేరియా ఇన్స్పెక్టర్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు పార్క్ సూపర్వైజర్, టీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply