ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి…

ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి…
వీరులపాడు, ఆంధ్రప్రభ : ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని గోకరాజు పల్లి గ్రామానికి చెందిన మొల్లెంపూడి మహేష్ (45) కొణతాలపల్లి గ్రామంలో సుమారు పది ఎకరాలలో పుల్ల శేనగ సాగు చేశాడు. పంట కోత దశకు రావడంతో జుజ్జూరు గ్రామం నుండి కూలీలను తీసుకువస్తూ రోజు పని చేయిస్తూ ఉంటారు . ఆదివారం ఉదయం కూలీలను తీసుకొచ్చి పని ముగిసిన తర్వాత కూలీలను ట్రాక్టర్లో జుజ్జూరు తీసుకువెళ్లి అక్కడ దింపి తిరిగి వస్తుండగా ఎన్ఎస్పి కాల్వ సమీపంలో రహదారి మరమ్మతులకు గురవ్వడంతో ట్రాక్టర్ ప్రమాద వశాస్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై వీరులపాడు ఎస్సై అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
