Rahul Gandhi | ఇరాన్ లాంటి పరిస్థితులు మనకొద్దు

Rahul Gandhi | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఇండో–అమెరికన్ ట్రేడ్ డీల్ దేశానికి ప్రమాదకరమని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా వికారాబాద్‌కు చేరుకున్న ఆయన, అక్కడ నిర్వహించిన కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యల వల్ల దేశంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించారు. ఇరాన్ వంటి పరిస్థితులు భారత్‌కు రాకూడదని, కేంద్ర ప్రభుత్వం విదేశాంగ, ఆర్థిక విధానాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించినట్లు సమాచారం.

Leave a Reply