భారత చట్టాలపై అవగాహన : సిఐ శ్రీ హర్ష

భారత చట్టాలపై అవగాహన : సిఐ శ్రీ హర్ష
రాప్తాడు, ఆంధ్రప్రభ : ఆకతాయిల ఆట కట్టిస్తాం- తిరుగుబోతుల తాట తీస్తాం ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? శక్తి యాప్ వినియోగించండి. అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించామని రాప్తాడు సిఐ శ్రీహర్ష పేర్కొన్నారు. అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.జగదీష్ ఆదేశాల మేరకు రాప్తాడు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు సిఐ శ్రీహర్ష, శక్తి టీం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం 8వ తేదీ సంధర్భంగా కాలేజీ విద్యార్థినులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి రాప్తాడు గ్రామంలో ప్రధాన వీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సంధర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ విద్యార్థినిలు మహిళలు విద్యార్థులు చిన్నారులు చైతన్యవంతులు కావాలని సమాజ ప్రగతికి మహిళల పట్టుదల ఆత్మవిశ్వాసం బలమైన పునాదులని వివరించారు. శక్తి టీం ద్వారా వారాంతర అవగాహన ర్యాలీలు సదస్సులు పెయింటింగ్ డ్రాయింగ్ వక్తృత్వ వ్యాసరచన పోటీలు హెల్త్ క్యాంపులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు.
మహిళలు విద్యార్థులు చిన్నారులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. అలాగే భారతీయ చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల సమస్యల కోసం డయల్ 112 చైల్డ్ లైన్ 1098 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్లకు సమాచారం అందించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శక్తి టీం ఏఎస్ఐ బాబా, ఫక్రుద్దీన్, ఏఎస్ఐ శ్రీరామ్ నాయక్, హెడ్ కానిస్టేబుళ్లు ఆనంద్, హుమాయూన్ భాష అంజాద్ వలి, కానిస్టేబుళ్లు నవీన్, సుధాకర్, జగదీష్, సుమన్, శ్రీనివాసులు ,మహిళా కానిస్టేబుళ్లు విజయలక్ష్మి, వెంకట సుబ్బమ్మ, రమాదేవి, స్టేషన్ సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
