ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ: కడెం మండలంలోని ఏలగడప గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చందు పంతులు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు.
అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏలగడప గ్రామానికి చెందిన బిగాల చంద్రవిలాస్–భూలక్ష్మి దంపతుల కుమారుడు సాయి కృష్ణ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ నర్సింగ్, అశ్విత రమేష్, ఉపసర్పంచ్ రాపర్తి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఆగునూరి సత్యమ్మ–గంగన్న, పంచాయతీ కార్యదర్శి బి. నరేష్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ బిగాల చంద్రశేఖర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
