Challapally |కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యం

Challapally | కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యం
నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్
చల్లపల్లిలో జనసేన సభ్యత్వ నమోదు శిబిరాలు ప్రారంభించిన వెంకట్రామ్
వెంకట్రామ్ సమక్షంలో జనసేనలో చేరికలు
అఖిల భారత దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుల్లా కిషోర్ జనసేన పార్టీలో చేరిక
వక్కలగడ్డ నుంచి జనసేనలో చేరిన ఇరవై మంది ఎస్సీ మహిళలు
చల్లపల్లిలో పార్టీలో చేరిన మహిళలు, యువకులు, పెద్దలు
జనసేన కండువాలతో స్వాగతం పలికిన మండలి వెంకట్రామ్
Challapally | చల్లపల్లి, ఆంధ్రప్రభ : కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం చల్లపల్లి బస్టాండ్ సెంటరులో ఆర్య వైశ్య యువనేత, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఉరిమి మణికాంత్, ఏటీఎం సెంటరులో జనసేన పార్టీ మండల నాయకులు అనుమకొండ పూర్ణచంద్రశేఖర్ (ప్రెస్ పూర్ణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరాలను వెంకట్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ పట్ల అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు. పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రతి గ్రామంలో విశేష స్పందన లభిస్తోందన్నారు.

మంచి ఆలోచనలతో ముందుకు వచ్చే యువత పార్టీలో ఉద్యమి సభ్యత్వం తీసుకుని నిస్వార్థ సేవాతత్పరులు పవన్ కళ్యాణ్ బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటరులో మణికాంత్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ సభ్యత్వం రెన్యూవల్స్ చేయించుకున్నారు. ఏటీఎం సెంటరులో ప్రెస్ పూర్ణ ఏర్పాటు చేసిన శిబిరంలో వక్కలగడ్డ నుంచి జనసేన పార్టీ నాయకుడు మట్టా చిన్నా ఆధ్వర్యంలో ఇరవై మంది ఎస్సీ మహిళలు జనసేన పార్టీలో చేరారు. వారికి మండలి వెంకట్రామ్ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు.

ప్రెస్ పూర్ణ ఆధ్వర్యంలో అఖిల భారత దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా కిషోర్, బత్తిన నాంచారయ్య అడపా బాబూరావు, తూములూరి సాయి కిరణ్, తూములూరి ప్రీతం, కే.పద్మజ లక్ష్మి తదితరులు వెంకట్రామ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరూ పార్టీ ఉద్యమి సభ్యత్వం తీసుకున్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, మండల పార్టీ అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట మురళీకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు, పూషడం సర్పంచ్ అంకం మారుతీరావు, ఏఎంసీ డైరెక్టర్ సూదాని నందగోపాల్, పార్టీ నాయకులు పసుపులేటి రవికుమార్, సోమిశెట్టి రాఘవ, గోళ్ళ ప్రసాద్, మిరియాల జితేంద్ర, కోనేరు శ్రీనివాసరావు, అడపా రమేష్, కూరేటి రాఘవ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
