కరుణగిరి పుణ్యక్షేత్రం ట్రాపిక్ విధుల్లో యానిమేటర్లు..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఖమ్మం జిల్లా రోమన్ క్యాథలిక్ మిషన్ ఖమ్మం విశాధిపతి బిషప్ డిడి డాక్టర్ సగిలి ప్రకాష్ సూచనల మేరకు కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్లు రెవరెండ్ ఫాదర్స్ జ్వానేస్,ఆంథోనీ రాజ్, ఖమ్మం జిల్లా జ్యోతిర్మయి డైరెక్టర్, ఫాదర్ కాకమాను రాజు సారధ్యంలో జరిగే కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవంలో విచారణలోని జ్యోతిర్మయి యానిమేటర్లు ట్రాఫిక్ నిబంధనలో భాగంగా అహర్నిషులుగా విధులు నిర్వహించడం గర్వకారణమని కొనియాడారు.
ఉమ్మడి రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, ఆయా గ్రామాల వ్యాప్తంగా కరుణగిరి పుణ్యక్షేత్రయాత్రా మహోత్సవాలకు క్రైస్తవ భక్తులు జనసందోహంతో తరలిరావడంతో, బైపాస్ రోడ్డు కరుణగిరి వద్ద ట్రాఫిక్ జామ్ కావడం వాహనాల రద్దీతో కూడిన నియమ నిర్దేశించిన పలు మార్గాలకు తరలించడం, భక్తులను దివ్యబలి సమర్పణ ఆరాధన కార్యక్రమాలలో పూజాపీఠం ప్రాంతానికి వెళ్లేందుకు పంపించడం జరుగుతుందని, పూజకార్యక్రమాలకు ఆటంకం ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పలు ప్రాంతాలలో విధులను నిర్వహించడం గర్వకారణమని జ్యోతిర్మయి డైరెక్టర్ ఫాదర్ కాకమాను రాజు అభినందించారు.
ఫిబ్రవరి 27 నుండి మార్చి 02 వరకు ఖమ్మంలోని కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రముఖదైవ సందేశకులు, ఆధ్యాత్మిక గురువు, స్వస్థత వరాలు కలిగిన, అనుభవజ్ఞులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డివైస్ వీసీ మెర్సీ రిట్రీట్ ఫాదర్ జైసన్ ప్రసంగంతో పాటు, విజీ తప్పేట శౌరీ గురువుతో విశ్రాంత బిషప్ పాల్ మైపన్ బిషప్ తండ్రి దివ్యబలి పూజను సమర్పిస్తారని తెలిపారు.
ముగింపు పూజల్లో క్రైస్తవ భక్తులు, విశ్వాసులు, భక్తిశ్రద్ధలతో భారీఎత్తున ఉజ్జివ మహోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జ్యోతిర్మయి యానిమేటర్ల కోఆర్డినేటర్ శౌరి, యానిమేటర్లు సుందర్రావు, ప్రసాద్, యేసురాజు, చిన్నప్ప, పాస్కాలి, శాంతయ్య, మోహన్రావు, బాబురావు, దేవానందం, బాలస్వామి, యోహాను, ఆంధ్రప్ప,ఆళ్లపల్లి విచారణ జ్యోతిర్మయి యానిమేటర్ పరమ ప్రభాకర్, బ్రదర్స్, సిస్టర్స్, గురువులు తదితరులు పాల్గొన్నారు.
