తెలంగాణలో గడ్డపార ప్రభుత్వం నడుస్తుంది

తెలంగాణలో గడ్డపార ప్రభుత్వం నడుస్తుంది
చత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ధైర్యం, సాహసాలకు మారుపేరు చత్రపతి శివాజీ
ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలి
పేదలను పట్టించుకోవడం లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
చౌటుప్పల్, ఆంధ్రప్రభః తెలంగాణలో తెలంగాణలో గడ్డపార ప్రభుత్వం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంధర్ రావు ఆరోపించారు. ధైర్య, సాహసాలకు మారుపేరైన చత్రపతి శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యం, పరాక్రమం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశ రక్షణ, సంస్కృతి పరిరక్షణలో శివాజీ చూపిన నాయకత్వ లక్షణాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. మొగల్ లోకి వ్యతిరేకంగా చత్రపతి శివాజీ చూపిన తెగువా ధైర్యం, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. యువత త్యాగస్ఫూర్తి, క్రమశిక్షణతో సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రామచందర్ రావు పిలుపు నిచ్చారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బారీ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నినాదాలతో గ్రామం మార్మోగింది. కార్యక్రమం పూర్తిగా ఉత్సాహభరితంగా సాగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నరసయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గం కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, కొయ్యలగూడెం గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, ఉప సర్పంచ్ జెల్ల పవన్ కుమార్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కైరంకొండ అశోక్, పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు ఆలే శ్రీలత చిరంజీవి, బుడ్డ సురేష్, పోలేపల్లి లక్ష్మి, పార్టీ మండల ఉపాధ్యక్షులు యాస అశోక్ రెడ్డి, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బజరంగ్ దళ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

