49 divisions | మొబైల్ మెడికల్ క్యాంపున‌కు విశేష స్పందన..

49 divisions | మొబైల్ మెడికల్ క్యాంపున‌కు విశేష స్పందన..

క్యాంపులో వైద్య సహాయం పొందిన వందలాది మంది ప్రజలు…

49 divisions | భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమలో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది…శనివారం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.. కొత్తపేట లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపులో 48, 49 డివిజన్లలోని ప్రైజర్ పేట, టైలర్ పేట, జోడు బొమ్మల సెంటర్, తదితర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు.

ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో, తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.. అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయనున్నారు.. అదే విధంగా దంత పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన వైద్య సహాయం కూడా అంద చేశారు.. కార్యక్రమాన్ని సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కార్పొరేటర్లు బుల్లా విజయకుమార్, అప్పాజీ, రాజేష్ లతో పాటు కూటమి నాయకులు, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వీరమాచినేని కిరణ్, వెంకట రమణ, హరీష్ లతో పాటు సుజనా మిత్ర లు పాల్గొన్నారు.

Leave a Reply