మణికొండలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న స్థలంతో పాటు.. నాలాను ఆక్రమించి ఏర్పాటు చేసిన రేకుల ప్రహరీని శనివారం హైడ్రా తొలగించింది. హైటెన్షన్ కరెంటు తీగల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలను అతిక్రమించడమే కాకుండా.. చారిత్రక బులకాపూర్ నాలాను కూడా ఓ నిర్మాణ సంస్థ కబ్జా చేస్తున్నదని స్థానికుల నుంచి ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో హైడ్రా క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించింది.
మణికొండ మర్రి చెట్టు వద్ద ఓ నిర్మాణ సంస్థ నాలాను కలిపేసుకుని, హైటెన్షన్ కరెంటు తీగల కింద నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారణ అవ్వడంతో రేకుల ప్రహరీని హైడ్రాను తొలగించింది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగ్, పుప్పలగూడ, మణికొండ, దర్గా, షేకేపేట్, టోలి చౌకి, పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీరును తీసుకెళ్లే బుల్కాపూర్ నాలా పునరుద్ధరణతో చాలా ప్రాంతాలకు భూగర్భ జలాలు పెంచినట్టు అవుతుందని స్థానికులు హైడ్రాను కోరారు. అలాగే హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీటిని తీసుకువచ్చే ఏకైక నాలాగా దీనికి ప్రత్యేక స్థానం ఉందని స్థానికులు పేర్కొన్నారు.