టాలెంట్ టెస్టులు మెరిసిన విద్యార్థినిలు..

టాలెంట్ టెస్టులు మెరిసిన విద్యార్థినిలు..
జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని ఉర్దూ పాఠశాలలకు చెందిన విద్యార్థినిలు టాలెంట్ టెస్ట్ లో తమప్రతిభ కనబరుస్తూ అందరి మన్నాలను పొందారు.జుక్కల్ ఉర్దూ మీడియం పాఠశాలకు చెందిన ముస్కాన్ ఫాతిమా టాలెంట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరచి ప్రశాంశ పత్రం తో పాటు మెమొంట్ అందుకున్నారు.దింతో పాటు పెద్దగుల్ల ఉర్దూపాఠశాలకు చెందిన విద్యార్థినిలు షేక్,హుర్య,షేక్ హీబ సైతం ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ తమ సత్తాను చాటారు. ఇరువురు విద్యార్థులు సైతం ప్రశంశపత్రం తోపాటు మెమొంట్లు అందుకున్నారు వీరికి జుక్కల్ ఉపసర్పంచ్ షేక్,ఫిర్దోస్ తోపాటు ప్రధానోపాధ్యాయులు ఆఫషన్ మేడమ్,సమిన బేగంతో పాటు ఇరు గ్రామాల ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు అభినందిస్తూ విద్యార్థినిలు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
