ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..

దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతులు ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని దండేపల్లి మండల పశు వైద్యాధికారి డా,ధనరాజ్ అన్నారు, శుక్రవారం దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రతి బుధవారం, శుక్రవారం నిర్వహించే శిబిరంలో పశువులకు టీకాలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి శుక్రవారం పశువుల సంత ఉండడం వలన మూగ జీవాలకు తగు చికిత్సను అందించాలనే ఉద్దేశ్యంతో సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు జంతు ప్రేమికులు ఈ పశువైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో, సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ ఫయాజ్రై తులు తదితరులు పాల్గొన్నారు.
