నెల్లూరు నగర నూతన మేయర్ సుజాత

నెల్లూరు నగర నూతన మేయర్ సుజాత
నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు నగర మేయర్ గా కార్పొరేషన్ 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ప్రత్యేక కార్పోరేషన్ సమావేశంలో దేవరకొండ సుజాత పేరును 40 వ డివిజన్ కార్పోరేటర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు కార్పోరేటర్లు అందరూ ఏకగ్రీవంగా మద్దతు పలికారు.
పోటీ లేకపోవడంతో 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను నెల్లూరు కార్పొరేషన్ మేయర్ గా ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు
