బీజేపీ నేతల అరెస్టు అక్రమం..

బీజేపీ నేతల అరెస్టు అక్రమం..

ఆలేరు, ఆంధ్రప్రభ : కామారెడ్డిలో బీజేపీ నేతల అరెస్టు అక్రమం అని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్ అన్నారు. భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శారాజిపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన చెప్పారు. బీజేపీ సీనియర్ నాయకులు కళ్లెం యాదగిరి, కంతి రవి, అమర్ పాల్గొన్నారు.

Leave a Reply