Delhi | ఢిల్లీలో హైఅలర్ట్

Delhi | ఢిల్లీలో హైఅలర్ట్
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్ర మూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
చాందిని చౌక్ సమీపంలోని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బ్లాస్ట్‌లకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సమాచారంతో కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై, చాందినీ చౌక్, ఓల్డ్ ఢిల్లీలో నిఘా పెంచి, బాంబు స్క్వాడ్స్‌తో తనిఖీలు ముమ్మరం చేశారు. 2025, నవంబర్లో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బ్లాస్ట్‌ను ఉగ్రదాడిగా నిర్ధారించారు.
