Games | జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీలు…

Games | జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీలు…

పోస్టర్‌ను అవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఎ.శ్యామ్ ప్రసాద్

Games | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ శాప్ లీగ్ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. క్రీడలను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి తీసుకెళ్లడం, యువతలో క్రీడా చైతన్యం పెంపొందించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యం.మొత్తం 31 క్రీడా విభాగాలలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించబడనున్నాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితర క్రీడలు ఇందులో భాగంగా ఉన్నాయి.

జిల్లాలోని యువ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు జిల్లా కలుక్టర్ తెలిపారు.

జిల్లాలోని అర్హత కలిగిన క్రీడాకారులు వెబ్‌సైట్ ద్వార https://sports.ap.gov.in నమోదు చేసుకోవాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో 5వ చిఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ విజయ్ కుమార్ , ఎక్సైజ్ శాఖ అధికారి గోవింద నాయక్ , ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ డా. సునీల్ కుమార్ , జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి. కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply