ప్రజల గొంతుకనైతా.. 11వ వార్డులో ‘బత్తుల అనసూయ మోర మానస మోక్షానందం’ ప్రచార జోరు!

ప్రజల గొంతుకనైతా.. 11వ వార్డులో ‘బత్తుల అనసూయ మోర మానస మోక్షానందం’ ప్రచార జోరు!

గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ బీఆర్ఎస్ అభ్యర్థి పర్యటన
కారు గుర్తుకు ఓటు వేసి వార్డు అభివృద్ధికి సహకరించాలని విన్నపం
అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతున్న వార్డు ప్రజలు

బెల్లంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల అనసూయ మోర మానస మోక్షానందం నిర్వహిస్తున్న ప్రచార పర్వం వార్డులో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఆదివారం వార్డులోని ప్రధాన వీధులు, బస్తీలలో ఆమె తన మద్దతుదారులు మరియు పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం.. ఈ సందర్భంగా బత్తుల మానస మోక్షానందం మాట్లాడుతూ.. 11వ వార్డు ప్రజల గొంతుకగా నిలిచి, వారి సమస్యలను మున్సిపల్ కౌన్సిల్‌లో వినిపిస్తానని హామీ ఇచ్చారు.

వార్డులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం మరియు తాగునీటి ఎద్దడిని పరిష్కరించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తన గెలుపుకు సోపానాలని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చూస్తానని, వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మానసకు వార్డు ప్రజలు, ముఖ్యంగా మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతున్న తీరు, సమస్యలపై ఉన్న అవగాహన ఓటర్లను ఆకట్టుకుంటోంది. వార్డులో ఆమెకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే 11వ వార్డులో బీఆర్ఎస్ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యావంతురాలైన మానసను గెలిపించుకుంటే వార్డు రూపురేఖలు మారుతాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మానసకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

Leave a Reply