భద్రాచలం (ఆంధ్రప్రభ): ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి ఓ యువతికి తీవ్రగాయాలు అయ్యాయి.సదరు యువతి రాంపురం గ్రామానికి చెందిన కుంజ పాండేగా గుర్తించారు. 108 ద్వారా భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. యువతి కుడి కాలికి తీవ్ర గాయం కాగా.కాలు తొలగించే పరిస్థితి ఉందని సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Breaking News | మావోయిస్టుల మందు పాతర పేలి యువతికి గాయాలు
