Tributes | ఘనంగా సుభాష్ చంద్రబోస్‌ జయంతి వేడుకలు

Tributes | కరీమాబాద్, ఆంధ్రప్రభ : బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా 40వ డివిజన్లోని ఉర్సు సిఆర్సి భవన్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహమునకు కార్పొరేటర్ మరుపల్ల రవి పూలదండ వేసి ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు.

కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ… ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలని అలాంటప్పుడే మన దేశం అన్ని రంగాల్లో రాణిస్తుందన్నారు మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన ఉక్కు సంకెళ్లు నుండి విముక్తి పొందుటకు దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు నిర్వహించిన ముఖ్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 20 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం వల్లే 11 మార్లు అరెస్టు అయ్యి జైలు జీవనం గడిపినారనీ ఆయన ఆశయాలు కొనసాగించాలని అన్నారు.

కార్యక్రమంలో డివిజన్ వార్డ్ ఆఫీసర్ ప్రవీణ్ బిల్ కలెక్టర్ రాజకుమార్, దయాకర్, టీచర్ కంచ సమత, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరుపల్ల గౌతం, శెట్టి మోహన్, టం టం నరసింహ, చీర రమేష్, వేల్పుగొండ నర్సింగo గోనె మధు పాలడుగుల నరేష్, మహిళా నాయకురాలు గుళ్ళపల్లి కరుణ, గుడికండోజు అనిత, ఏనుగుల మానస, నాంపల్లి అంజలి, కత్తెరపల్లి సరస్వతి, సరిత ,మిర్యాల వాసుదేవ్, చిలుపూరీ ఐలయ్య, జవాన్ రమేష్ పాల్గొన్నారు.

Leave a Reply