MLA | జాతర ఏర్పాట్లు పక్కాగా చేయాలి..

MLA | జాతర ఏర్పాట్లు పక్కాగా చేయాలి..
- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు
- త్రాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- 24వరకు అన్ని పనులు పూర్తి చేయాలి
- జాతరను విజయవంతంగా పూర్తి చేయాలి
- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
MLA | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలి. త్రాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. జాతర కోసం చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు 24వ తేదీ లోపు పూర్తిచేయాలి. 25వ తేదీ జరిగే ప్రారంభోత్స వం జాతర పనులకు ఘనంగా ఆరంభం కావాలి..
జాతర కమిటీ చైర్మన్, స్థానిక సర్పంచులు సమన్వయంతో పని చేసి సమ్మక్క సారలమ్మ జాత రను విజయవంతంగా పూర్తి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ రోజు స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని జిట్టేగూడెం-తాటికొండ పరిధిలో జరిగే మినీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను సంబంధిత శాఖ అధికా రులతో ఆయన కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం వసతుల కల్పనకు 54లక్షలు మంజూరు :
నియోజకవర్గ పరిధిలోని 7 మినీ సమ్మక్క సారలమ్మ జాతరలలో వస తుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 54లక్షలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. జాతర ప్రాంతంలో ఫార్మేషన్ రోడ్లు, గద్దెల కలరింగ్, టాయిలెట్స్, త్రాగు నీరు, విద్యుత్ శాఖ సంబంధిత పనులన్నింటిని 24వ తేదీ నాటికి పూర్తి చేయాలి. 25వ తేదీన పను లను ప్రారంబొత్సవం చేసుకోవాలన్నారు. అలాగే 9లక్షల ఎంపీ నిధుల తో 6 జాతరలలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఫార్మే షన్ రోడ్లు, విద్యుత్ వంటి పనులకు మరో 26లక్షలు మంజూరు చేసిన ట్లు మొత్తం 89లక్షల 50వేలతో జాతరలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలి పారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జాతర జరిగే నాలుగు రోజులు జాతర స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. జాత రలలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలన్నారు.
జాతర జరిగే ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి పారిశుధ్య సిబ్బందిని నియ మించుకోవాలని తెలిపారు. అలాగే పోలీస్ అధికారులు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని అన్నారు. అందరూ సమన్వయంతో పని చేసి జాతరలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకన్న, జాతర గౌరవ అధ్యక్షులు చల్లా సుధీర్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, స్థానిక సర్పంచ్ లు మార పాక సుజన శ్రీనివాస్, బాలు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు మధుసూదన్ రెడ్డి, బేతి జైపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ కట్టమల్లు, పంచాయతీ రాజ్, విద్యుత్, రూరల్ వాటర్ సప్లై, ఎండోమెంట్, రెవిన్యూ, పోలీస్ శాఖల అధికారులు, జాతర కమిటీల చైర్మన్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
