Bikkanoor | దివ్యాంగులకు అండగా ప్రభుత్వం…

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అఖిల భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి అన్నారు. ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో దివ్యాంగులు వివాహం చేసుకుంటే రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించడంతో పాటు ప్రభుత్వం జారీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని తెలిపారు.
ఈసందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు దివ్యాంగుల శాఖ మంత్రి లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా దివ్యాంగులకు ప్రత్యేక రుణాలు అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఎంతోమంది దివ్యాంగులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రభుత్వం అందించే రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.
