Doctor | మూర్చతో భయం వద్దు

Doctor | మూర్చతో భయం వద్దు

Doctor | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మూర్చ వచ్చిన రోగులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, రోగం దాచకుండా క్రమం తప్పకుండా మాత్రలు వాడితే తప్పక నయం అవుతుందని విజయవాడకు చెందిన ప్రముఖ నరాల వైద్యులు డాక్టర్ గోపాలం శివన్నారాయణ పేర్కొన్నారు. కొత్తగా వైద్యశిబిరానికి వచ్చే మూర్చ బాధితులు ఇదివరకే వాడిన మాత్రలు, స్కానింగ్ రిపోర్టులు ఉంటే వెంట తీసుకొని రావాలని సూచించారు.

ఈ రోజు స్థానిక ఎన్జీవో హోంలో జన విజ్ఞాన వేదిక కదిరి శాఖ రెగ్యులర్ మూర్చ వైద్య శిబిరం నిర్వహించింది. ఈ వైద్య శిబిరానికి ఆయన హాజరై ప్రారంభించారు. రోగులను పరీక్షించి వైద్య సలహాలు సూచనలు అందించారు. నాలుగు నెలలకు సరిపడా మాత్రలను నామ మాత్రపు ధరలకు అందించారు. 62 మంది మూర్చ బాధితులు హాజరై చికిత్స లు పొందారు. తదుపరి మూర్చ వైద్య శిబిరం మే నెల 17 న జరుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బి.నరసారెడ్డి పేర్కొన్నారు.వైద్యశిబిరంలో మహబూబ్ బాషా, మహేంద్ర రెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply