Crime| బట్టబయలైన దంపతుల బాగోతం..

Crime | బట్టబయలైన దంపతుల బాగోతం..

  • బెదిరింపులతో లక్షలాది రూపాయల వసూలు
  • 100 మంది వరకు బాధితులు..

Crime | కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా పరిచయం పెంచుకొని.. మొదట మెల్లగా వలపుతో వల వేస్తారు.. ఆ తర్వాత తమ బుట్టలో పడ్డ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. తమ అవరాలను తీర్చుకునేందుకు లక్షలాది రూపాయలను వసూలు చేస్తారు.. దంపతులిద్దరూ కలిసి పథకం ప్రకారం ఇలా పన్నిన వలలో దాదాపు 100 మంది వరకు బాధితులు పడిపోయారు.. చివరకు పోలీసులు వారి బాగోతాన్ని బట్టబయలు చేశారు.. సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్ (Black Mail) చేస్తున్న భార్యాభర్తల ఆగడాలకు ఎట్టకేలకు కరీంనగర్ రూరల్ పోలీసులు అడ్డు కట్ట వేశారు.. ఈ రోజు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు.. గత రెండె ళ్లుగా కరీంనగర్ రూరల్ మండలంలోని ఆరేపల్లి లో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటూ.. ఇన్స్టాగ్రామ్లో తమ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఉన్నారు.

ఇవి చూసిన కొంతమంది వ్యక్తులు చూసి అకౌంట్ను ఫాలో అవుతూ ఆమె నెంబరు తీసుకొని ఆమెను సంప్రదిస్తున్నారన్నారు. ఈ క్రమంలో డబ్బులు తీసుకొని రావాలని.. మీతో శృంగారం చేస్తానని తన అడ్రస్ తెలుపగా దాదాపు 100 మంది వరకు కరీంనగర్, చుట్టుపక్కన ఏరియాలో నుండి కొందరు బడా వ్యాపారస్తులు, యువకులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కు వచ్చి మరీ భర్త అనుమతితో పని కానిచ్చేవారు. అయితే డబ్బులు ఇచ్చేవారు వారు శృంగారం చేసిన సమయంలో నగ్నంగా ఉన్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా తన భర్త ఫోన్లో వీడియో రికార్డు (Video Record) చేసేవారన్నారు. వారు ఇచ్చిన డబ్బులతో అపార్ట్మెంట్ ఈఎంఐ లోన్ కట్టడంతోపాటు టాటా కారు కొనుక్కొని దర్జాగా తిరుగుచుండె వారన్నారు. అపార్ట్మెంట్లో ఏసీలు, సోఫా సెట్లు విలువైన బెడ్స్ కూడా సమకూర్చుకున్నారని, తమ దగ్గరకు వచ్చిన వారిని న‌గ్నంగా తీసిన వీడియోలను వైరల్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారన్నారు. పరువు పోతుందని కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులు భయంతో డబ్బులు ఇచ్చే వారన్నారు.

Karimnagar | ఏడాది క్రితం పరిచయం.. రూ. 14లక్షల వసూలు..

ఏడాది క్రితం పరిచయమైన కరీంనగర్కు చెందిన వ్యక్తి వారికి బాగా చనువుగా ఉండి ఆమె భర్తతో మందు తాగుతూ ఆమెతో ఎక్కువసార్లు గడిపాడన్నారు. దీంతో అతనికి మాయ మాటలు చెప్పి వారి అపార్ట్మెంట్ లోనులు, కారు ఈఎంఐలు అతనితోనే కట్టించేవారని, చివరకు అతని వద్ద డబ్బులు అయిపోయి కొన్ని రోజులు రావడం మానేశాడన్నారు. దీంతో అతనికి వాట్సాప్ కాల్స్ చేసి నీవు ఎందుకు రావడం లేదంటే తన దగ్గర డబ్బులు లేవు ఇక నన్ను వదిలిపెట్టండి అని చెప్పడంతో భార్యాభర్తలు (Husband Wife) అట్టి వ్యక్తిని మాకు 5 లక్షలు ఇస్తేనే నిన్ను మర్చిపోతామని చెప్పడంతో తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో డబ్బులు ఇవ్వకపోతే నీ వీడియోలు మీ ఇంట్లో వారికి పంపుతామని బెదిరించారన్నారు.

అంతటితో ఆగకుండా చంపుతామని బెదిరించడంతో భయంతో సదరు వ్యక్తి ఒక లక్ష రూపాయలు ఇస్తానని ఒప్పుకొని శ్రీపురం కాలనీ బోర్డు (Board) వద్ద ఉండగా గమనించిన భార్యాభర్తలు వచ్చి బెదిరించడంతో లక్ష అప్పగించాడన్నారు. మిగతా 4లక్షలు రెండు రోజుల్లో పంపిస్తామని, ఇంతవరకు దాదాపు 14 లక్షల వరకు ఇచ్చానని, నన్ను ఏమి చేయవద్దని వీడియోలను తీసివేయాలని వేడుకున్నాడన్నారు.

Crime

Karimnagar | ఎట్టకేలకు పోలీసుల చెంతకు..

అయినప్పటికి వేధింపులు ఆగక పోవడంతో తన బంధువులు, మిత్రులకు జరిగిన విషయాన్ని చెప్పగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారన్నారు. దీంతో బాధితుడు పోలీస్ (Police) స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు వారికి ఇచ్చిన డబ్బులు ఫోన్ పే ద్వారా ఆధారాలు చూపించడంతో భార్య భర్తల ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఏసిపి విజయ్ కుమార్ ఆదేశాలతో రెండు గ్రూపులుగా విడిపోయి గాలించగా, బుధవారం ఉదయం టేస్టీ దాబా వద్ద ఆగి ఫోన్ మాట్లాడుతుండగా అనుమానంతో వారిని పట్టుకొని వి చారించడంతో నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు.

నగ్నంగా ఉన్న వీడియోలు తీసిన మొబైల్ ఫోన్లను, బాధితుడు ఇచ్చిన చెక్కును వాటిని స్వాధీనం చేరుకొని స్టేస్టన్కు తరలించిన అనంతరం రిమాండ్ (Remand) చేశామన్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల నిమిత్తం జైలుకు తరలించాలని ఆదేశాలిచ్చారన్నారు. నిందితులైన భార్యాభర్తలది మంచిర్యాల జిల్లా కాగా, వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. గత కొంతకాలంగా కరీంనగర్లో ఉంటూ ఈ వ్యవహారం జరుపుతున్నట్లు సీఐ వివరించారురు. కేసును 24 గంటల లోపు ఛేదించి పట్టుకున్న కరీంనగర్ రూరల్ సిబ్బంది ని కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ అభినందించారు.

CLICK HERE TO RAED భార్య‌ను చంపిన భ‌ర్త‌

CLICK HERE TO RAED MORE

Leave a Reply