9.35 Crores | సినీ న‌టి అషురెడ్డి తండ్రి స్పంద‌న‌

9.35 Crores | సినీ న‌టి అషురెడ్డి తండ్రి స్పంద‌న‌

9.35 Crores | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సినీ నటి అషు రెడ్డిపై హైదరాబాద్ సిటీ క్రైమ్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. లండన్‌లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గత ఏడేళ్లలో సుమారు రూ. 9.35 కోట్లు, 5 కిలోల బంగారం మరియు ఆస్తులను కాజేశారని బాధితుడి తండ్రి స‌త్య‌నారాయ‌ణ ఫిర్యాదు చేశారు. ఆషురెడ్డి సోద‌రికి రూ.50ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్లు ఫిర్యాదులో ఆయ‌న పేర్కొన్నారు. 2018 నుంచి డ‌బ్బులు తీసుకుంద‌న్న బాధితుడి తండ్రి పేర్కొన్నారు. ఈ మోసంలో అషురెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై సీసీఎస్ (CCS) పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే అషురెడ్డి వివాదంపై ఆమె తండ్రి స్పందించారు. ధ‌రేంద్ర నుంచి అశురెడ్డి డ‌బ్బులు తీసుకున్న‌ది నిజ‌మేనని చెప్పారు. వాళ్ల అమ్మ చెప్పుడు మాట‌లు మాట‌లు విని అషురెడ్డి ఇలా చేసింది. కూతురు చేసిన త‌ప్పున‌కు తాను కూడా శిక్ష అనుభ‌వించాల్సిందేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాన‌ని అషురెడ్డి తండ్రి పేర్కొన్నారు. అషురెడ్డి ఆమె త‌ల్లే చెడ‌గొడుతుంద‌ని, ధ‌రేంద్ర‌కు ఇంత‌కుముందే పెళ్లి జ‌రిగింద‌ని తెలిసినా త‌ల్లే పెళ్లికి ఒప్పించింద‌ని, ధ‌రేంద్ర కుటుంబానికి కాల్ మ‌నీ కేసుతో సంబంధాలున్నాయ‌ని అషురెడ్డి తండ్రి పేర్కొన్నారు. వాళ్ల కుటుంబం డైలీ ఫైనాన్స్ న‌డుపుతుంద‌ని, అశురెడ్డి నా కూతురు కాబ‌ట్టి నా మీద కేసు పెట్టారు. ధ‌ర్మేంద్ర నుంచి అషురెడ్డి డబ్బులు తీసుకున్న మాత వాస్త‌వ‌మే. అంతా ఆమె త‌ల్లే చేసింది. నా కూతురు అమాయ‌కురాలు. త‌ల్లి ఏది చెబితే అది వింటుంద‌ని అషురెడ్డి తండ్రి వాపోయాడు.

9.35 Crores
9.35 Crores
9.35 Crores
9.35 Crores
9.35 Crores

Leave a Reply